Advertisement

  • దేశంలోని 850 నగరాల్లో భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్న ఫ్లిప్‌కార్ట్

దేశంలోని 850 నగరాల్లో భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్న ఫ్లిప్‌కార్ట్

By: chandrasekar Fri, 11 Sept 2020 09:24 AM

దేశంలోని 850 నగరాల్లో భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్న ఫ్లిప్‌కార్ట్


దేశవ్యాప్తంగా 50 వేల కిరాణా దుకాణాలతో ఫ్లిప్‌కార్ట్ జతకట్టింది. కిరాణా ఆన్‌బోర్డింగ్ కార్యక్రమాన్ని దేశంలోని 850 నగరాల్లో డెలివరీ చేయడానికి విస్తరించింది. ఈశాన్య రాష్ట్రాలు సహా అన్ని ప్రాంతాల్లోని నగరాలకు సైతం సేవలందించేందుకు ఫ్లిప్‌కార్ట్ సిద్ధమైంది. కిరణా ఆన్ బోర్డింగ్ కార్యక్రమాన్ని టిన్సుకియా (అస్సాం), అగర్తాలా (త్రిపుర), కన్నూర్ (కేరళ) వంటి ప్రదేశాలతో పాటు మారుమూల, దూర నగరాలకు విస్తరించినట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేష్ ఝా తెలిపారు. "ఫ్లిప్‌కార్ట్ హైపర్‌లోకల్ దేశంలో కిరాణా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో గొప్ప సహాయకారిగా మారింది. తమను తాము తిరిగి ఆవిష్కరించుకోవడానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ పరిశ్రమతో పొత్తు పెట్టుకోవడానికి దేశవ్యాప్తంగా కిరణాల నుంచి పెరుగుతున్న భాగస్వామ్యాన్ని పొందినందుకు సంతోషిస్తున్నాం” అని పేర్కొన్నారు.

ఫ్లిప్‌కార్ట్ భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నది. ఫ్రీలాన్స్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లతో సామాన్లు చేరవేస్తూ ఈ-కామర్స్ వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పిస్తుంది. గత సంవత్సరం ఫ్లిప్‌కార్ట్ యొక్క ‘ది బిగ్ బిలియన్ డే’ సందర్భంగా కిరణాలు సమిష్టిగా లక్షకు పైగా సరుకులను పంపిణీ చేశాయి. కిరణా ఆన్ బోర్డ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా మిలియన్ల మంది కిరణాల వృద్ధిని పెంచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక భాగం. స్థానిక తయారీదారులు, ఎంఎస్ఎంఈలను చిల్లర, ఇతర వ్యాపారాలతో అనుసంధానించే లక్ష్యంతో డిజిటల్ బీ 2 బీ మార్కెట్ అయిన ఫ్లిప్‌కార్ట్ టోకు కూడా ఇందులో ఉంది.


Tags :

Advertisement