Advertisement

  • వాల్‌మార్ట్‌ ఇండియాలో 100శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటన

వాల్‌మార్ట్‌ ఇండియాలో 100శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటన

By: chandrasekar Fri, 24 July 2020 3:28 PM

వాల్‌మార్ట్‌ ఇండియాలో 100శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటన


ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ వాల్‌మార్ట్‌ ఇండియా హోల్‌సేల్‌ వ్యాపారాన్ని సొంతం చేసుకుంది. వాల్‌మార్ట్‌ ఇండియాలో 100శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.

త్వరలోనే కొత్త డిజిటల్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ను ప్రారంభించబోతుంది.

ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ ప్రారంభించడం ద్వారా టెక్నాలజీ, లాజిస్టిక్స్‌, ఆర్థిక తదితర వనరులను చిన్న వ్యాపార సంస్థలకు విస్తరిస్తామని ప్లిప్‌కార్ట్‌ గ్రూప్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ను ఆగస్టులో లాంచ్‌ చేయనున్నారు. గ్రోసరీ, ఫ్యాషన్‌ కేటగిరీల్లో తొలుత పైలట్‌ సేవలను అందించనుంది. దిగ్గజ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఆన్‌లైన్‌ కిరాణా వ్యాపార విభాగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. జియో మార్ట్‌ పేరిట ఈ–కామర్స్‌ వెంచర్‌ను ఇటీవల ప్రారంభించింది. జియో మార్ట్‌కు పోటీగానే ఫ్లిప్‌కార్ట్‌ హోల్‌సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ వ్యూహాత్మకంగా తీసుకొచ్చినట్లు తెలుస్తున్నది.

Tags :

Advertisement