Advertisement

  • వైద్య సిబ్బందిపై నిఘా కన్ను ..తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

వైద్య సిబ్బందిపై నిఘా కన్ను ..తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

By: Sankar Tue, 13 Oct 2020 08:03 AM

వైద్య సిబ్బందిపై నిఘా కన్ను ..తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం


వైద్య సిబ్బందిపై నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది సకాలంలో ఆసుపత్రులకు వెళ్లేలా, రోగు లకు వైద్యం చేసేలా పర్యవేక్షణ చేయాలని భావిస్తోంది.

గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీ హెచ్‌సీ) సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. తద్వారా హైదరాబాద్‌ నుంచే సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించ డానికి మార్గం ఏర్పడనుంది. వైద్య సిబ్బంది సకాలంలో ఆసుపత్రికి వస్తు న్నారా లేదా అని పర్యవేక్షించి, అవసరమైతే అప్ర మత్తం చేయడానికి వీలు కలగనుంది.

పీహెచ్‌సీల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు స్థానికం గా ఉండటం లేదన్న విమర్శలున్నాయి. సమీప పట్టణాల్లో నివాసముంటూ పీహెచ్‌సీలకు వస్తూ పోతూ ఉంటారు. వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే వచ్చేవారు ఎక్కువగా ఉంటా రని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కొందరు డాక్ట ర్లయితే దాదాపు రోజుకు వంద కిలోమీటర్లకు పైగా వెళ్లే వారుంటున్నారు. హైదరాబాద్‌లో ఉం టూ నిజామాబాద్‌ జిల్లాలోని పీహెచ్‌సీలకు వెళ్లే వైద్యులూ ఉన్నారని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల సమాచారం.

వీరు పట్టణాల్లో ప్రైవేట్‌ ప్రాక్టీసు చేస్తుండటంతో పీహెచ్‌సీలకు రావడంలేదన్న విమర్శలున్నాయి. ఒకవేళ వచ్చినా ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకే వెళ్లిపో తున్నారన్న ఫిర్యాదులు గ్రామాల నుంచి ప్రభు త్వానికి అందాయి. అందుకే వారి కదలికలపైనా ఎప్పటికప్పుడు నిఘా పెట్టేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Tags :
|
|

Advertisement