Advertisement

  • బెలిండా తో పాటు ఐదుగురు ప్లేయర్లు యూఎస్ ఓపెన్ కు దూరం

బెలిండా తో పాటు ఐదుగురు ప్లేయర్లు యూఎస్ ఓపెన్ కు దూరం

By: chandrasekar Tue, 18 Aug 2020 11:06 AM

బెలిండా తో పాటు ఐదుగురు ప్లేయర్లు యూఎస్ ఓపెన్ కు  దూరం


యూఎస్ ఓపెన్ నుంచి స్విట్జర్లాండ్ మహిళల టెన్నిస్ స్టార్ బెలిండా బెన్సిచ్ తప్పుకుంది. కరోనా మహమ్మారి ముప్పు ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బెలిండా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దీంతో టాప్ టెన్ లో ఐదుగురు ప్లేయర్లు ఈసారి టోర్నీకి దూరమయ్యారు. కాగా, ఈ నెల 31 నుంచి న్యూయార్క్​ వేదికగా యూఎస్ ఓపెన్ జరగనుంది.

గతేడాది యూఎస్ ఓపెన్ లో సెమీఫైనల్ కు చేరినబెన్సిచ్ వరల్డ్​ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక వరల్డ్​ నంబర్ వన్ యాష్ బార్టీ, ఆరో ర్యాంకర్ ఆండ్రెస్క్యూ, తోలినా (ఐదో ర్యాం క్), కికి బెర్టెన్స్ ( ఏడో ర్యాంకర్ ) టోర్నీకి దూరంగా ఉంటున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

Tags :
|

Advertisement