Advertisement

ఎదురెదురుగా విమానాలు ఢీ... అయిదుగురు మృతి

By: Sankar Sun, 11 Oct 2020 1:16 PM

ఎదురెదురుగా  విమానాలు ఢీ... అయిదుగురు మృతి


ఫ్రాన్స్‌లో రెండు చిన్న‌సైజు విమానాలు ఢీకొని ఐదుగురు ప్ర‌యాణికులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఓ మైక్రోలైట్ విమానం మ‌రో టూరిస్ట్ విమానాన్ని ఢీకొట్టడంతో ప్ర‌మాదం జ‌రిగింది.

వెస్ట్ర‌న్ ఫ్రాన్స్‌లోని లోచెస్‌లో ఫ్రాన్స్ కాల‌మానం ప్ర‌కారం శ‌నివారం మ‌ధ్యాహ్నం ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఇద్ద‌రు ప్రయాణికుల‌తో వెళ్తున్న మైక్రోలైట్ విమానం ఎదురుగా వచ్చిన‌ టూరిస్టు విమానాన్ని డీకొట్టింది. దీంతో రెండు విమానాలు లోచెస్‌లోని ఓ ఇంటి ముందు కూలిపోయాయి.

ప్ర‌మాదంలో మైక్రోలైట్ విమానంలోని ఇద్ద‌రు, టూరిస్టు విమానంలోని ముగ్గురు ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు. లోచెస్ ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. కాగా ప్ర‌మాదానికి కార‌ణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంద‌న్న లోచెస్ పోలీసులు ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|
|

Advertisement