Advertisement

నేడే రోహిత్ కు ఫిట్‌నెస్‌ టెస్ట్

By: Sankar Fri, 11 Dec 2020 09:45 AM

నేడే రోహిత్ కు ఫిట్‌నెస్‌ టెస్ట్


టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తాడా లేదా అనేది ఈ రోజు తేలిపోనుంది..జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో నేడు రోహిత్‌కు ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహిస్తారు.

బీసీసీఐ వైద్య బృందంతోపాటు ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్, సెలక్టర్లు కూడా దీనిని పర్యవేక్షిస్తారని సమాచారం. ఫిట్‌నెస్‌ పరీక్షలో సఫలమైతేనే అతను ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశం ఉంది. అంతా బాగుండి అత ను ఆస్ట్రేలియాకు వెళితే నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్‌ అనంతరం జట్టుతో కలవాల్సి ఉంటుంది.

తొలి రెండు టెస్టులకు రోహిత్‌ దూరం కావడం ఇప్పటికే ఖాయం కాగా... చివరి రెండు టెస్టులకు అతను అందుబాటులో ఉండవచ్చు.ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా తో జరిగిన వన్ డే మరియు టి ట్వంటీ సిరీస్ లకు రోహిత్ దూరమైన సంగతి తెలిసిందే..తొలి టెస్ట్ తర్వాత కోహ్లీ ఇండియా కు రానుండటంతో రోహిత్ వంటి సీనియర్ ఆటగాడు అవసరం టీమిండియా కు ఉంది..

Tags :
|
|
|

Advertisement