Advertisement

  • అమెరికాలో తొలిసారిగా రెండు సార్లు కరోనా వచ్చిన కేసు నమోదు..ఈ సారి వ్యాధి తీవ్రత మరింత అధికం

అమెరికాలో తొలిసారిగా రెండు సార్లు కరోనా వచ్చిన కేసు నమోదు..ఈ సారి వ్యాధి తీవ్రత మరింత అధికం

By: Sankar Sun, 30 Aug 2020 05:48 AM

అమెరికాలో తొలిసారిగా రెండు సార్లు కరోనా వచ్చిన కేసు నమోదు..ఈ సారి వ్యాధి తీవ్రత మరింత అధికం


కరోనా ఒకసారి వస్తే మళ్ళీ రాదు అని చాల మంది భావిస్తున్నారు..శరీరంలో ఇమ్మ్యూనిటి డెవెలప్ అయి కరోనా రెండో సారి రాకుండా చేస్తుంది అని అందరూ భావిస్తున్నారు..అయితే చాల దేశాల్లో కరోనా రెండోసారి ఎటాక్ అయిన కేసెస్ నమోదు అయితున్నాయి..ఇండియాలో అయితే ఇప్పటివరకు ఇలాంటి కేసు అధికారికంగా నమోదు అవ్వలేదు..కానీ అమెరికాలో మాత్రం ఇలా రెండో సారి కరోనా వచ్చిన కేసు అధికారికంగా నమోదు అయింది..

దేశంలో ఇలాంటిది ఇదే మొట్టమొదటి కేసుగా భావిస్తున్నారు. యూరప్‌తోపాటు హాంకాంగ్‌లో ఇటీవల ఇలాంటి కేసులు బయటపడిన విషయం తెలిసిందే. నెవడాలోని రెనోకు చెందిన ఓ వ్యక్తి(25) ఏప్రిల్‌లో కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్నాడు. జూన్‌లో అతనికే మళ్లీ పాజిటివ్‌గా నిర్ధారణయింది.

మొదటిసారి కంటే ఈసారి అతడిపై వైరస్‌ తీవ్ర ప్రభావం చూపింది. న్యుమోనియా కూడా రావడంతో ఆస్పత్రిలో ఆక్సిజన్‌తో చికిత్స అందించాల్సి వచ్చింది. కరోనా వైరస్‌ మళ్లీ సోకేందుకు అవకాశం ఉందనీ, రెండోసారి మరింత తీవ్రంగా ఉండొచ్చని నెవడా స్టేట్‌ పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరీ డైరెక్టర్‌ మార్క్‌ పండోరి అన్నారు.

Tags :
|
|
|
|

Advertisement