Advertisement

F3 మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల

By: Sankar Sun, 13 Dec 2020 6:45 PM

F3 మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల


విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దిరెచ్తిఒన్ లో వచ్చిన ఎఫ్ 2 ఎంత బ్లాక్ బస్టర్ ఇట్ అయిందో అందరికి తెలిసిందే... ఆ సినిమాలో కామెడీ కి జనాలు కడుపుబ్బా నవ్వారు ..దీనితో ఫన్ ఇంకా పెంచేందుకు మల్లి వీరి కలయికలోనే ఎఫ్ త్రీ రాబోతుంది..ఈ విషయాన్ని కంఫర్మ్ చేస్తూ నేడు వెంకటేష్ బర్త్డే కానుకగా పోస్టర్ ను వదిలింది చిత్ర యూనిట్...

ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ చెరో ట్రాలీలో డబ్బుల కట్టలు వేసుకొని కదులుతున్నట్లు కనిపిస్తుండటం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ''ఇష్యూ డబ్బులు అయినప్పుడు మరి ఫన్ పీక్స్ లోనే ఉంటుందిగా.. అంతేగా అంతేగా..'' అంటూ ఈ పోస్టర్ పంచుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

అంతేకాదు F2ని మించి F3లో ఫన్ మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో కూడా తమన్నా, మెహ్రీన్ నటించబోతున్నారట. అలాగే వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో పాటు మరో హీరోకి అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఆయనెవరో అధికారికంగా ప్రకటించనున్నారని టాక్.

Tags :

Advertisement