Advertisement

  • దేశ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు యుద్ధక్షేత్రంలోకి ‘ప్రథమ మహిళ’ అన్నా హకోబియాన్...

దేశ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు యుద్ధక్షేత్రంలోకి ‘ప్రథమ మహిళ’ అన్నా హకోబియాన్...

By: chandrasekar Fri, 30 Oct 2020 1:58 PM

దేశ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు యుద్ధక్షేత్రంలోకి ‘ప్రథమ మహిళ’ అన్నా హకోబియాన్...


అర్మేనియా, అజర్‌బైజాన్‌ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్నది. ఇప్పటికే ఈ పోరులో వేలమంది ప్రాణాలు కోల్పోయారు. దేశ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తాను కూడా యుద్ధరంగంలోకి దూకుతున్నట్లు అర్మేనియా ప్రథమ మహిళ ‘అన్నా హకోబియాన్‌' ప్రకటించింది. మరో 12 మందితో కలిసి, ఫ్రంట్‌ లైన్‌ సైనికురాలిగా శిక్షణ తీసుకునేందుకు మిలటరీలో చేరినట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. సాధారణంగా ఏ దేశంలోనైనా అధ్యక్షుడి భార్యకే ‘ప్రథమ మహిళ’ హోదా దక్కుతుంది. కానీ, అర్మేనియాలో మాత్రం ప్రధాని నికోల్‌ పషిన్యాన్‌ భార్య, 42 ఏండ్ల అన్నా హకోబియాన్‌ ‘ఫస్ట్‌ లేడీ ఆఫ్‌ అర్మేనియా’ గౌరవం పొందుతున్నారు. దేశ రాజధానిలోని ఎరవాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ చేసిన అన్నా, నికోల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు.

2012లో ఒక వార్తా పత్రికకు ఎడిటర్‌గా చేరారు. ప్రస్తుతం దేశంలోనే పెద్దదైన ‘అర్మేనియన్‌ టైమ్స్‌'లో ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2018లో అప్పటి దేశాధ్యక్షుడికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన ‘అర్మీనియన్‌ విప్లవం’లో అన్నా కీలక పాత్ర పోషించారు. ఆ ఉద్యమానికి పరోక్షంగా వ్యూహ రచన చేశారు. ఆ తర్వాతి పరిణామాలతో తన భర్త నికోల్‌ దేశ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు . అప్పటికే దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన అన్నా, ఆ తర్వాత పరిపాలనా నిర్ణయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు.

Tags :

Advertisement