Advertisement

  • రామాయణంలో పేర్కొన్న మొక్కలతో ఉత్తరాఖండ్ లో తొలి గ్రీన్ రామాయణ పార్క్

రామాయణంలో పేర్కొన్న మొక్కలతో ఉత్తరాఖండ్ లో తొలి గ్రీన్ రామాయణ పార్క్

By: Sankar Wed, 15 July 2020 5:58 PM

రామాయణంలో పేర్కొన్న మొక్కలతో ఉత్తరాఖండ్ లో తొలి గ్రీన్ రామాయణ పార్క్



హిందువులకు అత్యంత పవిత్ర గ్రంథం రామాయణం..రాముడి యొక్క జీవితం గురించి వాల్మీకి మహర్షి అందులో వివరించారు ..అయితే రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన చెట్లతో ఉత్తరాఖండ్ అటవీశాఖ దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ రామాయణ పార్కును అభివృద్ధి చేసింది. వాల్మీకి రామాయణంలో పేర్కొన్న మొక్కలన్నీ ఈ పార్కులో మనకు కనిపిస్తాయి.

రాముడితో సంబంధం కలిగిన 6 ప్రధాన అడవులు ఉన్నాయి. హవానీ ప్రాంతంలోని కుమావున్‌లో గ్రీన్ రామాయణ పార్కును ఆరు నెలల కాలంలో అభివృద్ధి పరిచారు. ఈ రకమైన థీమ్ ప్రాజెక్టులో మొదటిదని ఉత్తరాఖండ్‌ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (రీసెర్చ్ వింగ్) సంజీవ్ చతుర్వేది చెప్పారు.

వాల్మీకి రామాయణంలో పేర్కొన్నట్టుగా 139 జాతులను కనుగొని విశేష పరిశోధనల అనంతరం హవ్లానీ బయోడైవర్సిటీ పార్కులో ఆయా మొక్కలను పెంచుతున్నారు. వాల్మీకి రామాయణంలో పేర్కొన్న మొక్కల్లో 90 శాతం ప్రస్తుత అడవుల్లో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ నాటిన మొక్కల పేర్లతోపాటు వాటి జాతుల శాస్త్రీయ పేర్లు , శ్లోకాలు కూడా బోర్డుపై రాసి పెట్టారు.

Tags :
|
|
|
|

Advertisement