Advertisement

  • భారతదేశంలో ఫస్ట్-ఎవర్ BMW-2 సిరీస్ గ్రాన్ కూపే రిలీజ్

భారతదేశంలో ఫస్ట్-ఎవర్ BMW-2 సిరీస్ గ్రాన్ కూపే రిలీజ్

By: chandrasekar Sat, 17 Oct 2020 5:57 PM

భారతదేశంలో ఫస్ట్-ఎవర్ BMW-2 సిరీస్ గ్రాన్ కూపే రిలీజ్


భారతదేశంలో బీఎండబ్ల్యూ ఇండియా ఫస్ట్- ఎవర్ బీఎండబ్ల్యూ-2 సిరీస్ గ్రాన్ కూపే విడుదల చేసింది. చెన్నైలోని బీఎండబ్ల్యూగ్రూప్ ప్లాంట్ వద్ద ఉత్పత్తి చేస్తున్నఈ కారు ఇండియా బీఎండబ్ల్యూ డీలర్‌షిప్స్‌లో డీజిల్ వేరియెంట్స్‌లో లభించను౦ది. పెట్రోల్ వేరియెంట్ లోనూ త్వరలోనే విడుదల చేయనున్నారు. బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావాహ్ మాట్లాడుతూ ‘‘ఫస్ట్-ఎవర్ బీఎండబ్ల్యూ-2 సిరీస్ గ్రాన్ కూపె బీఎండబ్ల్యూ విజయవంతమైన ఫోర్-డోర్ కూపే కాన్సెప్ట్‌ను మొదటి సారిగా ఈ సెగ్మెంట్‌ కు తీసుకువచ్చింది.

అత్యాధునిక బీఎండబ్ల్యూ గా ఫస్ట్ –ఎవర్ BMW-2 సిరీస్ గ్రాన్ కూపే బీఎండబ్ల్యూ ప్రపంచానికి స్టైలిష్ తోపాటు విలాసవంతమైన ఎంట్రీను పొందాలనుకునే వారిని మరింతగా ఆకర్షించనున్నది. దీని స్టైలిష్ డిజైన్ పొడవైన సిల్హౌట్ ,ఫ్రేమ్‌లెస్ డోర్స్‌తో వస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్ వేరియెంట్స్- స్పోర్ట్స్ లైన్ లలో లభిస్తుంది. విశాలమైన ,అత్యాధునిక ఇంటీరియర్ అన్ని రకాల ప్రయాణాలకూ అనువుగా ఉంటుంది. పవర్ ఫుల్ ఇంజిన్ ఈ సెగ్మెంట్‌లో పనితీరు, అద్భుతమైన యాక్సలరేషన్ ను అందిస్తుంది. ఫస్ట్‌-ఎవర్ బీఎండబ్ల్యూ2 సిరీస్ గ్రాన్ కూపే డైనమిక్ లైఫ్‌స్టైల్వ్య తోపాటు, వ్యక్తిగత అభిరుచికి తగినట్లుగా ఉంటుంది.

స్పోర్ట్స్ లైన్ తన స్పోర్టీ స్టైల్,ఆత్మవిశ్వాసపు ఉత్సాహాన్ని వేడుక చేసుకునేలా చేస్తుంది. అంతేకాకుండా పనోరమ గ్లాస్ సన్‌రూఫ్, పార్కింగ్ అసిస్ట్ విత్ రివర్స్ అసిస్ట్, ఇల్యుమినేటెడ్ ఇంటీరియర్ ట్రిమ్, బీఎండబ్ల్యూ లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్, గెశ్చర్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ,బీఎండబ్ల్యూ వర్చువల్ అసిస్టెంట్ తదితర ప్రత్యేకతలను అందిస్తోంది. ఫస్ట్-ఎవర్ BMW 2 సిరీస్ గ్రాన్ కూపే రెండు డీజిల్ డిజైన్ వేరియెంట్స్‌లో లభిస్తుండగా BMW 220d స్పోర్ట్ లైన్ : రూ.39,30,000, BMW 220d M స్పోర్ట్: రూ.41,40,000 ,ధరల్లో ఎక్స్-షోరూమ్ లో లభిస్తుంది.

Tags :
|
|
|

Advertisement