Advertisement

  • తెలంగాణాలో 1 నుంచి 5 తరగతులకు స్కూల్స్ బంద్ ...తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

తెలంగాణాలో 1 నుంచి 5 తరగతులకు స్కూల్స్ బంద్ ...తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

By: Sankar Thu, 24 Dec 2020 10:42 AM

తెలంగాణాలో 1 నుంచి 5 తరగతులకు స్కూల్స్ బంద్ ...తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం


తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల వరకు స్కూళ్లు తెరవొద్దని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది.

ఆయా తరగతుల వరకు నేరుగా ప్రమోట్‌ చేసే అవకాశం ఉంది. కరోనా సెకండ్‌ వేవ్‌ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఈ మేరకు స్కూళ్ల బంద్‌ నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల బంద్‌ నిర్ణయం ప్రైవేట్‌ విద్యా సంస్థలకు కూడా వర్తించనుంది.

ఇక తెలంగాణాలో నేడు 45 వేల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 635 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 115, రం గారెడ్డి జిల్లాలో 57, మే డ్చల్‌ మల్కాజిగిరిలో 49, ఖమ్మంలో 35 కేసులు వెలుగుచూశాయి. 573 మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు బుధవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది..

Tags :
|

Advertisement