Advertisement

  • ఓ యువకుడిని సినీ ఫక్కీలో కాపాడిన ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీస్ సిబ్బంది

ఓ యువకుడిని సినీ ఫక్కీలో కాపాడిన ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీస్ సిబ్బంది

By: chandrasekar Tue, 15 Sept 2020 5:25 PM

ఓ యువకుడిని సినీ ఫక్కీలో కాపాడిన ఫైర్ డిపార్ట్‌మెంట్, పోలీస్ సిబ్బంది


గుజరాత్‌లోని సూరత్‌లో ఓ ఘటన జరిగింది. సెప్టెంబర్ 14 వేకువజామున 3 గంటల సమయంలో 26 ఏళ్ల ఓ యువకుడు తన బైక్‌పై సూరత్ బ్రిడ్జిపైకి చేరుకున్నాడు. బ్రిడ్జిపై బైక్‌ను పార్క్ చేసి రెయిలింగ్ నుంచి కిందకి దిగాడు. అక్కడ నుంచి నదిలో దూకడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

ఫైర్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు బలవన్మరణానికి ప్రయత్నించిన యువకుడిని మాటల్లో పెట్టారు. ఈ లోగా ఫైర్ సిబ్బంది అతడికి కనబడకుండా ఓ తాడును సిద్ధం చేశారు. పోలీసులతో మాట్లాడుతూనే బాధితుడు ఒక్కసారిగా కిందకు దూకాడు. అదే సమయానికి ఫైర్ సిబ్బంది అతడి నడుముకు తాడు బిగించడంతో కిందపడకుండా ఆగిపోయాడు.

పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడం వల్లే యువకుడి ప్రాణాలు దక్కాయి. ఒక్క క్షణం ఆలస్యమైనా అతడు నదిలో దూకి మరణించేవాడు. అతడి మృతదేహం కూడా దొరికేది కాదేమో.ఎందుకంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. యువకుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణాల గురించి ఆరా తీయగా బాధితుడు సరైన సమాధానాలు చెప్పలేదని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :
|

Advertisement