Advertisement

అస్సాంలో ఆరు నెలల తర్వాత మంటలు ఆరిపోయాయి..

By: Sankar Mon, 16 Nov 2020 04:55 AM

అస్సాంలో ఆరు నెలల తర్వాత మంటలు ఆరిపోయాయి..


అస్సాం లోని బాఘ్ జన్ లో గల చమురుబావిలో చెలరేగిన మంటలు చల్లారాయి. సుమారు 6 నెలల పాటు ఈ గ్యాస్ వెల్ లో మంటలు మండుతూనే వచ్చాయి.

నల్లని పొగలు విరజిమ్ముతూనే వచ్చాయి. చివరకు ఆదివారం ఈ మంటలను పూర్తిగా ఆర్పినట్టు ఆయిల్ ఇండియా ప్రకటించింది. బ్రైమ్ సొల్యూషన్ అనే ప్రత్యేక లిక్విడ్ ని ఉపయోగించినట్టు ఈ సంస్ట వెల్లడించింది. ప్రస్తుతం ఈ చమురుబావిలో ఎలాంటి మంటలు లేవని, కానీ 24 గంటలపాటు పరిస్థితిని పరిశీలిస్తామని ఆయిల్ ఇండియా పేర్కొంది.

ఈ మంటలను ఆర్పేందుకు ప్రభుత్వం విదేశీ నిపుణులను కూడా రప్పించింది. కానీ ఫలితం లేకపోయింది. బ్లో ఔట్ కారణంగా చుట్టుపక్కల గల వందలాది కుటుంబాలను అధికారులు వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు.

Tags :
|
|
|

Advertisement