Advertisement

  • దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీపైనే టార్గెట్

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీపైనే టార్గెట్

By: chandrasekar Thu, 24 Sept 2020 10:07 AM

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీపైనే టార్గెట్


దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీపైనే టార్గెట్ చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించకపోయినా టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. తెలంగాణలో జరగబోయే దుబ్బాక ఉప ఎన్నికను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం గెలుపుతో సరిపెట్టుకోకుండా భారీ మెజార్టీతో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహం మారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేస్తుండటమే. టీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే ఆర్థిక మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు. బాయికాడ మీటర్లు రావొద్దన్నా విదేశీ మక్కలు రావొద్దన్నా మార్కెట్ యార్డులు రద్దు కావొద్దన్నా దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఏస్ అభ్యర్థిని లక్ష మెజారిటీతో గెలిపించి బీజేపీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు చేయాలని మంత్రి హరీశ్ రావు కోరారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. టీఆర్ఎస్ తరపున సోలిపేట రామలింగారెడ్డి భార్యకు టికెట్ దాదాపు ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక బీజేపీ తరపున దుబ్బాక నుంచి బరిలోకి దిగడానికి సిద్ధమైన రఘునందన్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్థానిక సమస్యలు, పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉండటంతో తనదైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తన మాట తీరుతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులను టీఆర్ఎస్ మోసం చేస్తోందని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ పార్టీ టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వడం వల్ల తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమనే భావన కలిగించవచ్చని యోచిస్తోంది. దుబ్బాకలో మెరుగైన ఫలితాలు సాధిస్తే ఆ ప్రభావం వచ్చే ఏడాది జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఉంటుందని బీజేపీ భావిస్తోంది. మరోవైపు దుబ్బాకలో బీజేపీని నిలువరించగలిగితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆ పార్టీని దెబ్బకొట్టొచ్చనే భావనలో టీఆర్ఎస్ ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే దుబ్బాకలో కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేస్తోందనే టార్గెట్ వినిపిస్తోంది.

Tags :

Advertisement