Advertisement

  • తెలంగాణాలో ఫైనల్ సెమిస్టరు పరీక్షల తేదీలు ఖరారు..

తెలంగాణాలో ఫైనల్ సెమిస్టరు పరీక్షల తేదీలు ఖరారు..

By: Sankar Wed, 02 Sept 2020 08:24 AM

తెలంగాణాలో ఫైనల్ సెమిస్టరు పరీక్షల తేదీలు ఖరారు..


తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థుల సెమిస్టర్‌ పరీక్షల (రెగ్యులర్‌/సప్లిమెంటరీ) తేదీలు ఖరారయ్యాయి.

కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన రెండో సెమిస్టర్‌ పరీక్షలను తాజాగా ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించాలని జేఎన్‌టీయూహెచ్‌ నిర్ణయిం చింది. ఇందుకు సంబంధించి రోజువారీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. బీటెక్, బీ ఫార్మసీలో ఆర్‌09, ఆర్‌13, ఆర్‌15, ఆర్‌16 సబ్జెక్టుల విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. సెమిస్టర్‌ పరీక్షలను రోజుకు రెండు చొప్పున నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో పరీక్ష నిర్వహిస్తారు.

కాగా ఇప్పటికే తెలంగాణాలో వివిధ ఎంట్రన్స్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి..నిన్న ఈ సెట్ పూర్తవగా , నేడు పాలీసెట్ జరగనుంది..ఇక సుప్రీమ్ కోర్ట్ కూడా ఫైనల్ సెమిస్టరు ఎగ్జామ్స్ పెట్టకుండా విద్యార్థులకు మెమోలు ఇవ్వొద్దు అని ఆదేశించిన విషయం తెలిసిందే..

Tags :
|
|

Advertisement