Advertisement

  • మీ గొంతుకు ఎప్పటికి లేదు మరణం ..ఎస్పీబీ మృతిపై ప్రముఖుల నివాళి

మీ గొంతుకు ఎప్పటికి లేదు మరణం ..ఎస్పీబీ మృతిపై ప్రముఖుల నివాళి

By: Sankar Fri, 25 Sept 2020 2:55 PM

మీ గొంతుకు ఎప్పటికి లేదు మరణం ..ఎస్పీబీ మృతిపై ప్రముఖుల నివాళి


గాన గందర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ప్రాణాలు విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే బాలుని కొలిచే అనేక హృదయాలు షాక్‌కు గురయ్యాయి. ఎప్పటికైనా పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఇన్ని రోజులుగా ఎదురు చూసిన వారికి బాలు మరణం తీరని శోకాన్ని మిగిల్చింది..

బాలు మృతికి ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్ స్పందిస్తూ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాన’’ని పేర్కొన్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అంటూ పేర్కొన్నారు.

నా అన్నయ్యను కోల్పోయాను ..మాది సినిమా బంధం మాత్రమే కాదు ..మెగాస్టార్ చిరంజీవి

నా కంట్లో కన్నీళ్లు ఆగడం లేదు.. మిమ్మల్ని మి్‌ అవుతున్నాం మామా’.. - తమన్‌

ఆగిపోయింది మీ గుండె మాత్రమే. మీ గొంతు కాదు. మీరెప్పుడు మాతోనే ఉన్నారు. ఉంటారు.’ - హరీష్‌ శంకర్‌

బాల సుబ్రహ్మణ్యం మన మధ్య లేరు అన్న వార్తను నమ్మలేకపోతున్నాను. మీ ఆత్మకు శాంతి చేకురాలి. మీ పాటలు చిరస్మరణీయం, బాలు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి...మహేష్ బాబు






Tags :
|

Advertisement