Advertisement

కరోనాపై పోరాటం...మహేష్ బాబు, వెంకటేష్

By: chandrasekar Sat, 10 Oct 2020 10:23 AM

కరోనాపై పోరాటం...మహేష్ బాబు, వెంకటేష్


దేశం కరోనాని సమిష్టిగా ఎదుర్కోవాలి అని తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ 'యునైట్‌2ఫైట్‌కరోనా' అనే నినాదానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు మోదీ తన ట్విట్టర్‌ ద్వారా ఈ పోస్ట్‌ని ప్రజలతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కరోనావైరస్ రికవరీ రేటు పెరిగింది కానీ, రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అందుకే కరోనాకి మెడిసిన్ వచ్చే వరకు ఎవరు తక్కువ అంచనా వేయకూడదని తెలిపారు. అలాగే ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం. దీంతో సమిష్టిగా కరోనాని జయించగలం అని ప్రధాని మోదీ ట్వీట్ చేసారు.

దీనిపై టాలీవుడ్‌ హీరోలు విక్టరీ వెంకటేష్, మహేష్‌ బాబు స్పందిస్తూ కరోనాని అంత తేలికగా తీసుకొవద్దని, కరోనాకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. తాను ఎలాగైతే కరోనాకి వ్యతిరేకంగా పోరాడుతున్నానో, ప్రజలందరూ కూడా అలాగే కరోనాకి వ్యతిరేకంగా పోరాడాలని విఙప్థి చేస్తూ విక్టరీ వెంకటేష్ ఓ వీడియోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో వెంకీ తన వయసును దాచుకోకుండా ఒరిజినల్ గెటప్‌లోనే కనిపించాడు. అలాగే మహేష్‌ బాబు స్పందిస్తూ, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సమిష్టిగా పోరాటం చేయడం ఒక్కటే మార్గం అని తెలిపారు. అంతే కాకుండా ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించండి, తరచుగా చేతులు కడుక్కోండి, సామాజిక దూరం పాటించండి అని మహేష్ బాబు మరోసారి గుర్తుచేశారు.

Tags :
|

Advertisement