Advertisement

  • 'వందేభార‌త్ మిష‌న్‌' కేర‌ళ‌ విమాన ప్ర‌మాదంలో 15 మంది మృతి

'వందేభార‌త్ మిష‌న్‌' కేర‌ళ‌ విమాన ప్ర‌మాదంలో 15 మంది మృతి

By: chandrasekar Sat, 08 Aug 2020 10:37 AM

'వందేభార‌త్ మిష‌న్‌' కేర‌ళ‌ విమాన ప్ర‌మాదంలో 15 మంది మృతి


కేర‌ళ కోజీకోడ్‌లో జ‌రిగిన ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో 15 మంది చ‌నిపోయారు. వీరిలో ఇద్ద‌రు పైల‌ట్లు ఉన్నారు. మ‌రో న‌లుగురు వ్య‌క్తులు ఇంకా విమానంలో చిక్కుకుని ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 50 మంది గాయ‌ప‌డ‌గా వీరిలో 15 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా ఎయిరిండియా విమానం దుబాయ్ నుంచి కేర‌ళ కోజికోడ్‌లోని క‌రిపూర్ విమానాశ్ర‌యానికి శుక్ర‌వారం రాత్రి 7.40 గంట‌ల‌కు చేరుకుంది.

కాగా ల్యాండింగ్ స‌మయంలో విమానం అదుపుత‌ప్పి ర‌న్‌వేపై క్రాష్ అయింది. ఈ ప్ర‌మాదంలో విమానం రెండు ముక్క‌లు అయింది. సంఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. విమానం ముందు భాగం ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. పైలట్ మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో 184 ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. కోజికోడ్‌లోని క‌రిపూర్ విమానాశ్రయంలో శుక్రవారం (ఆగస్టు 7) రాత్రి 7.45 గంల సమయంలో ఈ ఘ‌ట‌న జరిగింది.

పైలట్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఘటనా స్థలానికి 20కి పైగా అంబులెన్స్‌లు చేరుకున్నాయి. భారీ వర్షాలతో పాటు చీకటిపడటం సహాయ కార్యక్రమాలకు ఆటంకంగా మారింది. వందే భార‌త్ మిష‌న్‌లో భాగంగా విమానం దుబాయ్ నుంచి కోజికోడ్‌కు చేరుకుంది. అక్కడ నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :
|
|

Advertisement