Advertisement

  • కివీస్‌, ఆసిస్‌ ఆతిథ్యం లో ఫిఫా 2023 ఉమెన్స్‌ వరల్డ్‌కప్

కివీస్‌, ఆసిస్‌ ఆతిథ్యం లో ఫిఫా 2023 ఉమెన్స్‌ వరల్డ్‌కప్

By: chandrasekar Mon, 29 June 2020 10:51 AM

కివీస్‌, ఆసిస్‌ ఆతిథ్యం లో ఫిఫా 2023 ఉమెన్స్‌ వరల్డ్‌కప్


2023లో జరగనున్న ఫిఫా మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌ ఆతిథ్యం కోసం దాఖలు చేసిన బిడ్‌లో ఆసిస్‌, కివీస్‌లు కొలంబియాను వెనక్కి నెట్టాయి. 2023లో జరగనున్న ఈ మెగాటోర్నీ ఆతిథ్యాన్ని న్యూజిలాండ్‌, ఆసిస్‌ దక్కించుకున్నాయని ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో ప్రకటించారు.

రెండు దేశాల్లో కలిపి మొత్తం 12 నగరాల్లోని 13 స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రపంచకప్‌ మ్యాచ్‌లు 2023, జూలై 10 నుంచి ఆగస్టు 10 వరకు జరగనున్నాయి. 2019లో ఫ్రాన్స్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో 24 జట్లు పాల్గొన్నాయి. అయితే మొదటిసారిగా 2023లో జరగనున్న ప్రపంచకప్‌లో 32 జట్లు పాల్గొంటాయి.

మొత్తం 8 నాలుగు గ్రూపులుగా జట్లను విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి. క్వాలిఫయింగ్‌ మ్యాచులు వచ్చే ఏడాది ప్రారంభంకానున్నాయి. మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను అమెరికా జట్టు అత్యధికంగా నాలుగుసార్లు గెలుపొందింది. గత రెండు వరల్డ్‌ కప్‌లలో (2019, 2015) అమెరికా గెలుపొందింది.

Tags :
|
|

Advertisement