Advertisement

  • ఆడంబరాలు లేకుండా పండుగలు...‘సండే సంవాద్‌'లో కేంద్ర ఆరోగ్య మంత్రి

ఆడంబరాలు లేకుండా పండుగలు...‘సండే సంవాద్‌'లో కేంద్ర ఆరోగ్య మంత్రి

By: chandrasekar Mon, 12 Oct 2020 3:09 PM

ఆడంబరాలు లేకుండా పండుగలు...‘సండే సంవాద్‌'లో కేంద్ర ఆరోగ్య మంత్రి


దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు సాధారణ రీతిలో పండుగలు జరుపుకోవాలని కేంద్రం సూచించింది. భారీ సంఖ్యలో సమావేశాలను నిర్వహించొద్దని, ఆడంబరాలకు పోవద్దని తెలిపింది.

ఈ మేరకు ఆదివారం సోషల్‌ మీడియాలో నిర్వహించిన ‘సండే సంవాద్‌'లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడారు. వైరస్‌ కట్టడికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చే విధానమేదీ ఇప్పటివరకు రూపొందించలేదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు.

అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటే వ్యాక్సిన్‌ భద్రత, ఖచ్చితత్వానికి సంబంధించిన డేటా తప్పనిసరి అని సండే సంవాద్‌ కార్యక్రమంలో ఆదివారం ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ ప్రయోగ డేటా పైనే వినియోగ అనుమతులు ఆధారపడి ఉంటాయని చెప్పారు.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఫెలుడా పేపర్‌ స్ట్రిప్‌ టెస్టు కొద్ది వారాల్లో విడుదలవుతుందని తెలిపారు.

Tags :
|

Advertisement