Advertisement

  • వివిధ నగరాల్లో దీపాలు, టపాసులకు ప్రాధాన్యమిచ్చే పండుగలు...

వివిధ నగరాల్లో దీపాలు, టపాసులకు ప్రాధాన్యమిచ్చే పండుగలు...

By: chandrasekar Mon, 16 Nov 2020 5:02 PM

వివిధ నగరాల్లో దీపాలు, టపాసులకు ప్రాధాన్యమిచ్చే పండుగలు...


ఏడాదిలో బెర్లిన్ నుంచి బ్యాంకాక్ వరకు వివిధ నగరాల్లో దీపాలు, టపాసులకు ప్రాధాన్యమిచ్చే పండుగలు ఏంటో తెలుసుకుందాం. హిందువులకు అతి పవిత్రమైన పండుగ దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని జరుపుకొంటారు. అమావాస్య రోజు ఈ పండుగను జరుపుతారు. దీపాలు, క్యాండిల్స్‌ను వెలిగించడం ద్వారా చీకటిని వెలుగులు పారదోలుతాయని ఈ పండుగ ద్వారా తెలుపుతారు. ఈ పండుగ సందర్భంగా టపాసులు కాల్చి వేడుకలు చేసుకుంటారు. ఉత్తర థాయిలాండ్‌లో ఈ పెంగ్ ఫెస్టివల్ జరుపుకొంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లను కాగితంతో తయారు చేసిన లాంతర్లతో అలంకరిస్తారు. సాయంత్రం వాటిని గాల్లోకి వదిలి తమ తప్పులను క్షమించమని దేవుణ్ని ప్రార్థిస్తారు. ప్రతి ఏడాది పౌర్ణమి రోజు జరుపుకొంటారు. థాయిలాండ్‌తో పాటు పలు ఆసియా దేశాల్లో పౌర్ణమి రోజు రాత్రి లాయ్ క్రాథాంగ్ పండుగను జరుపుకొంటారు. ఈ పండుగ రోజు అరటి ఆకులతో చేసిన ప్రతిమలో ఒక దీపాన్ని ఉంచి నీటిలో వదిలేస్తారు. ఆ దీపం ఎలా అయితే నీటిలో తేలుతూ వెళ్తుందో.. అదే రకంగా భగవంతుడి కరుణతో తమ కష్టాలు కూడా పోతాయి అని వాళ్ళ నమ్మకం.

ఆమ్‌స్టర్డామ్ లైట్ ఫెస్టివల్ 53 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఆమ్‌స్టర్‌డామ్ వీధులన్నీ దీపాల కాంతితో వెలిగిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా కళాకారులు తయారు చేసిన వందలాది కళాఖండాలను పంపిస్తారు. వాటిని పరిశీలించిన సెలక్షన్ కమిటీ ఉత్తమమైన 30 కళాఖండాలను ఎంపిక చేస్తుంది. సిటీ కెనాల్స్‌లో బోటు ద్వారా వెళ్తే అద్భుతమైన క్రియేషన్లను చూడవచ్చు. ఫ్రెంచ్ సిటీ లియోన్‌లో ఫెట్ డెస్ లుమియర్స్ వేడుకలను జరుపుతారు. జీసస్ తల్లి మేరీకి కృతజ్ఞతలు తెలుపుతూ నాలుగు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బాల్కనీ, కిటికీల వద్ద దీపాలను ఉంచుతారు. నగరంలోని బిల్డింగ్‌లు, పార్కులు, వీధుల్లో కనీసం 40 రకాల డిజైన్లతో దీపాలను అలంకరిస్తారు. బాలా చతుర్దశి దీన్నే సత్బీజ్ చార్నీ ఆసి అని కూడా పిలుస్తారు. నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌లోని పశుపతినాథ్ ఆలయం సమీపంలోని శ్లేషమంతక్ అడవుల్లో ప్రతి ఏడాది జరుపుకొంటారు. అమావాస్యకు ముందు రోజు ఈ పండుగను జరుపుకొంటారు. రాత్రంతా నూనెతో దీపాలను వెలిగించి తమ జీవిత భాగస్వామి లేదా తమకు ఇష్టమైన వారు బాగుండాలని కోరుకుంటారు. మరుసటి రోజు భాగమతి నదిలో పుణ్యస్నానమాచరిస్తారు.

Tags :
|

Advertisement