Advertisement

  • అమెజాన్‌లో ఫెస్టివల్ సేల్... అక్టోబర్ 17 న స్టార్ట్

అమెజాన్‌లో ఫెస్టివల్ సేల్... అక్టోబర్ 17 న స్టార్ట్

By: chandrasekar Tue, 06 Oct 2020 6:01 PM

అమెజాన్‌లో ఫెస్టివల్ సేల్... అక్టోబర్ 17 న స్టార్ట్


దసరా, దీపావళి పండుగల సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసింది. అయితే ఈ సేల్ ఎప్పట్నుంచి ఉంటుందన్న సస్పెన్స్ ఇన్నాళ్లూ కొనసాగింది. ఇప్పుడు అమెజాన్ డేట్స్ ప్రకటించింది. అక్టోబర్ 17న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమవుతుందని యిప్పుడు ప్రకటించింది.

ప్రైమ్ మెంబర్స్‌కు ఈ సేల్ అక్టోబర్ 16న ప్రారంభం కానుంది. ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 16 నుంచి 21 వరకు ఉంటుందని ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్ ప్రారంభమైన ఓ రోజు తర్వాత అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలు కానుంది. అయితే అమెజాన్ సేల్ ఎప్పుడు ముగుస్తుందో ఇంకా ప్రకటించలేదు.

ఇక అమెజాన్ ఈసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఫెస్టీవ్ ట్రీట్స్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొన్నవారికి 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా వర్తిస్తాయి. అమెజాన్ పే యూజర్లు రోజూ రూ.500 వరకు షాపింగ్ రివార్డ్స్ పొందొచ్చు. ఇక బజాజ్ ఫిన్‌సర్వ్ కస్టమర్లు రూ.1,00,000 వరకు క్రెడిట్ లిమిట్ ఉపయోగించుకోవచ్చు.

Tags :
|
|
|

Advertisement