Advertisement

  • Breaking News: మాదాపూర్‌లో ఫెర్రారీ కారు బీభత్సం... 1 మృతి...!

Breaking News: మాదాపూర్‌లో ఫెర్రారీ కారు బీభత్సం... 1 మృతి...!

By: Anji Mon, 12 Oct 2020 09:02 AM

Breaking News: మాదాపూర్‌లో ఫెర్రారీ కారు బీభత్సం... 1 మృతి...!

హైదరాబాద్లోని మాదాపూర్‌లో మరో కారు ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత ఖరీదైన ఓ ఫెర్రారీ కారు బీభత్సం రేపింది. రోడ్డుపై పలువురిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్‌ నుంచి అతి వేగంగా వస్తున్న ఫెర్రారీ కారు మాదాపుర్‌ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి పుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది.

ఈ క్రమంలోనే ఫుట్‌పాత్‌పై నడుసున్న ఇద్దరు వ్యక్తులను వేగంగా ఢీకొట్టింది. వారిలో ఓ వ్యక్తి చనిపోయాడు. అతణ్ని పోలీసులు ఏసుబాబుగా గుర్తించారు. ఆయన ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్ మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా.

అతనితో పాటు నడుస్తున్న మరో వ్యక్తి సహా ఫుట్ పాత్‌పై నడుస్తున్న ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు వేగంగా నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Advertisement