Advertisement

  • నా భర్త అతిప్రేమను తట్టుకోలేకపోతున్నాను ..విడాకులు ఇప్పించండి

నా భర్త అతిప్రేమను తట్టుకోలేకపోతున్నాను ..విడాకులు ఇప్పించండి

By: Sankar Sun, 23 Aug 2020 11:28 AM

నా భర్త అతిప్రేమను తట్టుకోలేకపోతున్నాను ..విడాకులు ఇప్పించండి


భర్త వేధిస్తున్నాడు అనో , లేకపోతే కొడుతున్నాడు అనో కోర్ట్ మెట్లు ఎక్కి విడాకులు తీసుకునే భార్యలు ఎంతో మంది ఉన్న ఈ రోజుల్లో..భర్త అతి ప్రేమను తట్టుకోలేక భార్య విడాకులు కావాలని కోరిన విచిత్ర సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది..

నా భర్త కురిపించే ప్రేమను తట్టుకోలేకపోతున్నాను. అతి ప్రేమను భరించలేకపోతున్నా.. ఆయన నాతో గొడవపడటం అటుంచితే.. గట్టిగా ఓ మాటైనా అనడం లేదు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శించడం లేదు. ఇలాంటి వాతావరణం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంద’ని పేర్కొంటూ సంభల్ జిల్లాకు చెందిన ఓ ముస్లిం మహిళ విడాకుల కోసం షరియా కోర్టును ఆశ్రయించింది.

తన భర్త అప్పుడప్పుడు వంట చేస్తుంటాడని.. ఇంటి పనుల్లో తనకు సాయం చేస్తుంటాడని కూడా ఆ యువతి ఫిర్యాదు చేసింది. నేను ఎప్పుడు తప్పు చేసినా ఆయన క్షమిస్తాడు. నాకు ఆయనతో గొడవ పడాలని ఉంది. ప్రతి దానికి సర్దుకుపోయే ఇలాంటి మొగుడితో జీవితం నాకొద్దంటూ ఆమె విడాకులు కోరింది.

ఇక ఇదే విషయం మీద ఆమె భర్తను ప్రశ్నించగా నా భార్యను ఎప్పుడూ సంతోషంగా చూడాలనుకుంటున్నా’ అని చెప్పాడు. ఈ విడాకుల ఫిర్యాదును అంగీకరించొద్దని కూడా అతడు కోర్టును అభ్యర్థించాడు. దీంతో అతడి కోరికను మన్నించిన షరియా కోర్టు.. విడాకుల ఫిర్యాదును తిరస్కరించింది. భార్యాభర్తలిద్దరూ కలిసి ఓ పరిష్కారానికి రావాలని సూచించింది. కోర్టులో లాభం లేదనుకొని ఆమె పంచాయతీ పెద్దలను కలిసింది. వాళ్లు కూడా విడాకులు ఇప్పించడం తమ వల్ల కాదన్నారు.

Tags :
|
|
|

Advertisement