Advertisement

  • అమరావతిలో ఘోరం: ఆస్తి చాల్లేదంటూ కన్నతండ్రిని...!

అమరావతిలో ఘోరం: ఆస్తి చాల్లేదంటూ కన్నతండ్రిని...!

By: Anji Sat, 26 Sept 2020 9:09 PM

అమరావతిలో ఘోరం: ఆస్తి చాల్లేదంటూ కన్నతండ్రిని...!

ముసలి వయస్సులో కన్నతండ్రికి ఓ ముద్ద పెట్టాల్సిన కొడుకులు.. ఇచ్చిన ఆస్తి చాల్లేదంటూ రాక్షసులుగా మరీనా ఘటన ఘటన ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో చోటుచేసుకుంది. వృద్ధుడైన తండ్రిని కర్రతో విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా గొంతుపై కాలేసి తొక్కేశారు కర్కోటకులు. కసాయి కొడుకుల దాష్టీకానికి బలైన తండ్రి కోమాలోకి వెళ్లి.. అటు నుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడుకి చెందిన తూమాటి సుబ్బారావుకి నలుగురు కొడుకులు. తనకున్న పదెకరాల పొలంలో కొడుకులకి గతంలోనే ఒక్కో ఎకరం చొప్పున రాసిచ్చాడు. మిగిలిన ఆరెకరాలను తన వద్ద ఉంచుకున్నాడు. పెద్ద కొడుకు బ్రహ్మయ్య చనిపోవడంతో 2 కొడుకు ఆదెయ్య వద్ద ఉంటున్నాడు. ఇటీవల తన ఆరెకరాల భూమిని కూడా కొడుకులకు సమానం పంచి ఇచ్చాడు. తన ఇంటిని మాత్రం తనను చూసుకుంటున్న ఆదెయ్యకి ఇస్తానని చెప్పాడు. అదే ఆ తండ్రి పాలిట నేరమైంది.

ఇంటిని రెండో కొడుక్కి రాసిస్తాననడం మూడో కొడుకు వెంకటేశ్వరరావు, నాలుగో కొడుకు గోవిందయ్య నచ్చలేదు. ఆ విషయమై వివాదం చెలరేగింది. ఇల్లు ఒక్కడికే రాసివ్వడమేంటంటూ ఆగ్రహంతో రగిలిపోయిన చిన్న కొడుకులు తండ్రిని కర్రతో విచక్షణ రహితంగా కొట్టారు. కనిపెంచాడన్నకనీస కనికరం లేకుండా కన్నతండ్రి గొంతుపై కాలేసి తొక్కారు దుర్మార్గులు. దీంతో సుబ్బారావు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు.

Tags :

Advertisement