Advertisement

  • ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ఫై ఎఫ్‌ఏటీఎఫ్ ఆగ్రహం...

ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ఫై ఎఫ్‌ఏటీఎఫ్ ఆగ్రహం...

By: chandrasekar Sat, 24 Oct 2020 1:37 PM

ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ఫై ఎఫ్‌ఏటీఎఫ్ ఆగ్రహం...


ప్రపంచంలోని ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలను పర్యవేక్షించే ఉన్నత సంస్థ అయిన ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పాకిస్థాన్‌ ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం 27 పాయింట్ల యాక్షన్‌ ప్లాన్‌ను పూర్తిగా సాధించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన 21 అంశాల్లో పాక్‌ కొంత పురోగతి సాధించినట్లు గుర్తించింది. అయితే నిర్దేశించిన అన్ని కార్యాచరణల గడువు ముగిసినట్లు ఎఫ్‌ఏటీఎఫ్‌ పేర్కొంది. మిగతా 6 పాయింట్ల యాక్షన్‌ ప్లాన్‌ను 2021 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని గట్టిగా హెచ్చరించింది. అప్పటి వరకు గ్రే లిస్ట్‌లోనే కొనసాగిస్తామని ఎఫ్‌ఏటీఎఫ్‌ తెలిపింది.

పాకిస్థాన్‌ గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాపిటల్‌ హిల్‌ సంస్థ నుంచి లాబీ నడిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. గ్రే లిస్టులోనే కొనసాగనుండటంతో అభివృద్ధి కోసం నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులను పాకిస్థాన్‌ ఎదుర్కోనున్నది. ఒకవైపు ఇమ్రాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలోని విపక్షాలు గళమెత్తున్న తరుణంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ తీసుకున్న నిర్ణయం మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకుల అభిప్రాయం.

Tags :
|
|
|

Advertisement