Advertisement

  • చైనా సహకారంతో ఆర్టికల్‌ 370ని సాధిస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూఖ్‌ అబ్దుల్లా...

చైనా సహకారంతో ఆర్టికల్‌ 370ని సాధిస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూఖ్‌ అబ్దుల్లా...

By: chandrasekar Mon, 12 Oct 2020 3:16 PM

చైనా సహకారంతో ఆర్టికల్‌ 370ని సాధిస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూఖ్‌ అబ్దుల్లా...


మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 370 ఆర్టికల్‌ రద్దుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనా సహకారంతో మళ్లీ ఆర్టికల్‌ 370ని సాధిస్తామని ప్రకటించారు.

ఈ ఆర్టికల్‌ రద్దును చైనా ఎప్పటికీ అంగీకరించదని, సరిహద్దుల్లో ఆ దేశ దూకుడు వైఖరికి ఆర్టికల్‌ 370ని రద్దుచేయటమే కారణమని ఓ మీడియా సంస్థకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ఎల్‌ఏసీ వెంట చైనా ఇప్పడు చేసేదంతా ఆర్టికల్‌ 370ని రద్దుచేసినందుకే. ఎందుకంటే వాళ్లు దీనిని ఒప్పుకోరు. చైనా మద్దతుతో జమ్ముకశ్మీర్‌కు మళ్లీ 370 ఆర్టికల్‌ను పునరుద్ధరించగలమన్న నమ్మకం నాకుంది’ అని తెలిపారు.

చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను భారత ప్రధాని ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వటంపై ఫరూక్‌ అబ్దుల్లా వ్యంగాస్త్రాలు సంధించారు. ‘చైనా అధ్యక్షుడిని నేను ఆహ్వానించలేదు. మోదీ ఆయనను ఆహ్వానించటమే కాకుండా చెట్టాపట్టాలేసుకొని తిరిగి చెన్నై తీసుకెళ్లి విందు చేసుకున్నారు.

భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న చేపట్టిన చర్యను మేము ఎప్పటికీ అంగీకరించబోము’ అని స్పష్టంచేశారు. గతేడాది ఆగస్టు 5న మోదీ సర్కారు ఆర్టికల్‌ 370తోపాటు 35ఏను కూడా రద్దుచేసి, రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే.

Tags :

Advertisement