Advertisement

మరింత ఉద్ధృతంగా మారిన రైతులు ఆందోళన...

By: chandrasekar Fri, 11 Dec 2020 11:25 AM

మరింత ఉద్ధృతంగా మారిన రైతులు ఆందోళన...


రైతులు ఆందోళనలో భాగంగా రైల్వే ట్రాకులను దిగ్బంధం చేస్తారనే హెచ్చరిక చేస్తున్నారు. డిమాండ్లను పరిష్కరించాలని హెచ్చరించారు. నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది రైతుల కోసం కాదని, వ్యాపారుల కోసమేనని రైతు నేత బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ అన్నారు. ఢిల్లీ శివారులోని సింఘు వద్ద డిసెంబర్ 10 వతేదీన మీడియాతో ఆయన మాట్లాడారు. వ్యవసాయం రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, దానిపై చట్టాలు చేసే అధికారం కేంద్రానికి లేదని రైతు నేతలు పేర్కొంటున్నారు. రైతులు స్వేచ్ఛాయుత వ్యాపార అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు. చట్టాలతో రైతుల భూములకు సంపూర్ణ భద్రత ఉంటుందని భరోసా ఇచ్చారు.

రైతుల భూములను పారిశ్రామికవేత్తలు ఆక్రమిస్తారనే వదంతులు వినిపిస్తున్నాయి. ఒప్పంద వ్యవసాయం కొత్తదేమీ కాదు. గుజరాత్‌, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్‌, కర్ణాటకలో గత కొన్నేళ్లుగా ఇది కొనసాగుతోంది. అక్కడ ఎలాంటి సమస్యలు రాలేదు’ అని తోమర్ అన్నారు. ‘ఓవైపు కరోనా‌ పరిస్థితులు, మరోవైపు విపరీతమైన చలిలో అన్నదాతలు నిరసనలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. రైతులు ఎప్పుడు కోరితే అప్పుడు వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కనీస మద్దతు ధరపై రాతపూర్వక హామీ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రైతులు మరోసారి పరిశీలించాలి’ అని మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. రైల్వే ట్రాకులను దిగ్బంధం చేస్తారనే హెచ్చరికలో నేపథ్యంలో రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు.

Tags :
|
|

Advertisement