Advertisement

  • వ్యవసాయ చట్టాల రద్దు తప్ప మేము ఏది ఒప్పుకోము ..కేంద్రానికి స్పష్టంచేసిన రైతు సంఘాలు

వ్యవసాయ చట్టాల రద్దు తప్ప మేము ఏది ఒప్పుకోము ..కేంద్రానికి స్పష్టంచేసిన రైతు సంఘాలు

By: Sankar Tue, 01 Dec 2020 10:05 PM

వ్యవసాయ చట్టాల రద్దు తప్ప మేము ఏది ఒప్పుకోము ..కేంద్రానికి స్పష్టంచేసిన రైతు సంఘాలు


కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం చర్చలు జరిపింది. ముగ్గురు కేంద్ర మంత్రులతో కూడిన బృందం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

మూడు వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ఒక కమిటీని వేద్దామని కేంద్ర మంత్రులు ప్రతిపాదించగా రైతు సంఘాల నేతలు ఏకపక్షంగా తిరస్కరించారు. ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులు ఉంటారని, రైతు సంఘాల నుంచి ఎవరు ప్రతినిధులుగా ఉంటారో పేర్లు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌ కోరగా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు.

ఈ దశలో తాము కమిటీకి ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతకముందు ఎటువంటి షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో చర్చలకు వెళ్లాలని రైతు సంఘాల నాయకులు నిర్ణయించుకున్నారు

Tags :
|

Advertisement