Advertisement

  • రైతుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి ...కేంద్రాన్ని హెచ్చరించిన రైతు సంఘాలు

రైతుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి ...కేంద్రాన్ని హెచ్చరించిన రైతు సంఘాలు

By: Sankar Wed, 23 Dec 2020 8:34 PM

రైతుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి ...కేంద్రాన్ని హెచ్చరించిన రైతు సంఘాలు


నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అటు రైతులు, కావాలంటే సవరణలు చేసైనా సరే అమలు చేస్తామని ఇటు కేంద్రం మొండిపట్టు పడుతోంది. దీంతో కొద్ది రోజులుగా చేపట్టిన రైతుల ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. ఇద్దరి మధ్య జరుగుతున్న చర్చలు కూడా ముందుకు సాగడం లేదు.

ఈ క్రమంలో చర్చలకు రమ్మంటున్న కేంద్రం ఆహ్వానాన్ని రైతు సంఘాలు తిరస్కరించాయి. గతంలో పంపిన సవరణలను ఇప్పటికే తిరస్కరించామని, మళ్లీ వాటిని పంపొద్దు అని కోరాయి. కాలయాపనతో రైతుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని కేంద్రం చూస్తోందని, కానీ దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని రైతు సంఘాలు హెచ్చరించాయి.

కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రతిపాదనలతో రావాలని, అప్పుడే తిరిగి చర్చలను ప్రారంభిస్తామని తేల్చి చెప్పాయి. రైతుల ఐక్యవేదిక పేరుతో కేంద్రానికి లేఖ రాశామని, రాత పూర్వక హామీలతో చర్చలకు రావాలని కోరుతున్నామని తెలిపాయి. రైతులు చర్చలకు సిద్ధంగా లేరనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశాయి. తమ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డాయి.

Tags :
|

Advertisement