Advertisement

  • డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు కదిలేది లేదు ..రైతు సంఘాలు

డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు కదిలేది లేదు ..రైతు సంఘాలు

By: Sankar Mon, 30 Nov 2020 06:10 AM

డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు కదిలేది లేదు ..రైతు సంఘాలు


రైతు సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఆందోళన చేస్తున్న రైతులు బురారీ మైదానానికి వెళ్లాలన్న సూచనకు నో చెప్పాయి.

జంతర్ మంతర్ లేదా రామ్‌లీలా మైదానంలో నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడమే తమ ప్రధాన అజెండా అని తెలిపారు. డిమాండ్లపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నిరసనలు విరమించేది లేదన్నారు.

ఢిల్లీ వెళ్లే 5 ప్రధాన రహదారులపై బైఠాయిస్తాం.. మా డిమాండ్లకు కేంద్రం స్పందించే వరకు పోరాటం చేస్తాం, 4 నెలలకు సరిపడా నిత్యావసరాలు తెచ్చుకున్నాం అని ప్రకటించారు రైతు సంఘాల నేతలు. కేంద్ర హోంమంత్రికి పక్కనే ఉన్న రైతులతో మాట్లాడేందుకు తీరిక లేదు..

కానీ.. 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌లో రోడ్‌షో చేసేందుకు సమయం ఉందంటూ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తోంది హస్తం పార్టీ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల మేలు కోసమేనన్నారు ప్రధాని మోడీ. సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ చట్టాలను తీసుకొచ్చినట్లు మన్‌కీ బాత్‌లో తెలిపారు

Tags :
|

Advertisement