Advertisement

  • ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమానికి వ్యతిరేకంగా రైతు సంఘాలు విమర్శలు

ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమానికి వ్యతిరేకంగా రైతు సంఘాలు విమర్శలు

By: Sankar Sun, 27 Dec 2020 5:43 PM

ప్రధాని మోడీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమానికి వ్యతిరేకంగా రైతు సంఘాలు విమర్శలు


కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతులు దేశ రాజధాని ఢిల్లీలో నిరనసలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే...అయితే తాజాగా రైతులు ప్రధాని మోడీ మీద తీవ్ర విమర్శలు చేసారు..ప్రధాని నరేంద్ర మోదీ 72 వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమానికి వ్యతిరేకంగా రైతులు, నెటిజన్ల పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

ఇన్నాళ్లూ రేడియోలో మీరు చెప్తున్నదంతా వినీ వినీ అలసిపోయాం. ఇక చాలు ఆపండి. మా గోడు కూడా వినండి అని రైతులు విమర్శిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు బోర్డర్‌, ఫరీద్‌కోట్‌, రోహ్‌తక్‌ ప్రాంతాల్లో ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలిపారు. ఈ మూడు ప్రాంతాలు బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలోనివి కావడం విశేషం.

ఇక ట్విటర్‌లోనూ ‘మోదీ బక్వాస్ బంద్ కరో’ (మోదీ వ్యర్థ ప్రేలాపణ ఆపండి) అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఆదివారం మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభం కాగానే ఈ హ్యాష్‌ట్యాగ్ భారత్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘ప్రధాని మోదీ గారు. మన్ కీ బాత్ కాదు, నెల రోజులకు పైగా రైతులు చేస్తున్న నిరవధిక నిరసనలపై మాట్లాడండి’ అని డిమాండ్‌ చేస్తున్నారు...

Tags :

Advertisement