Advertisement

ఢిల్లీకి మ‌రో 200 లారీల్లో రైతులు...

By: chandrasekar Tue, 08 Dec 2020 9:02 PM

ఢిల్లీకి మ‌రో 200 లారీల్లో రైతులు...


వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు.. దేశ రాజ‌ధానిలో త‌మ నిర‌స‌న‌లను కొన‌సాగిస్తున్నారు. ఢిల్లీలోని సింఘు స‌రిహ‌ద్దులో మంగ‌ళ‌వారం రైతుల సంఖ్య భారీగా పెరిగింది. సోమ‌వారం నుంచి బంద్ కారణంగా భారీ సంఖ్య‌లో రైతులు అక్క‌డికి వస్తున్నారు. మరో 200 ట్ర‌క్కుల్లో రైతులు సింఘు స‌రిహ‌ద్దుకు వచ్చారు. దీంతో ఢిల్లీ పోలీసులు అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల‌ను జ‌ర‌గ‌కుండా భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసారు.

పోలీసులు.. ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగించినా, బ‌ల‌వంతంగా షాపుల‌ను మూసివేయించినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఇప్ప‌టికే రైతుల‌ను హెచ్చ‌రించారు. దేశ‌వ్యాప్తంగా కాకుండా త‌మ నిర‌స‌న‌ల‌కు అంత‌ర్జాతీయ మ‌ద్ద‌తు కూడా ల‌భించింద‌ని ఓ రైతు అన్నారు. ఘాజీపూర్‌, ఘ‌జియాబాద్ స‌రిహ‌ద్దులో ఢిల్లీ-మీర‌ట్ ఎక్స్‌ప్రెస్ వేను రైతులు పూర్తిగా నిర్బంధించారు. ఉద‌యం 10 గంట‌ల నుంచే ఈ హైవేను మూసివేయాల్సి వ‌చ్చింది. అత్యవసర వాహ‌నాల‌ను రైతులు వదిలేస్తున్నారు.

Tags :
|
|

Advertisement