Advertisement

  • రైతులు గత ఏడు రోజులుగా ఆందోళనలు...అమిత్‌షా నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ...

రైతులు గత ఏడు రోజులుగా ఆందోళనలు...అమిత్‌షా నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ...

By: chandrasekar Wed, 02 Dec 2020 9:39 PM

రైతులు గత ఏడు రోజులుగా ఆందోళనలు...అమిత్‌షా నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ...


కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆయన నివాసంలో సమావేశయ్యారు. మరో వైపు కేంద్రం అమలులోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు గత ఏడు రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

సమస్యలపై చర్చించేందుకు మంగళవారం రైతు యూనియన్ల నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. చర్చల్లో ఎలాంటి నిర్ణయానికి రాకపోవడంతో ప్రతిష్టంభణ నెలకొంది. గురువారం మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్రం, రైతు యూనియన్లు అంగీకరించాయి.

ఈ నేపథ్యంలో రైతు సంఘాల డిమాండ్లపై అమిత్‌షాతో చర్చించినట్లు సమాచారం. అలాగే రేపు జరిగే సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. మరో వైపు రైతులు ఢిల్లీ సరిహద్దులో తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.

ఢిల్లీ- ఖాపీపూర్‌ సరిహద్దు వద్ద ఆందోళన చేస్తున్న రైతులు పశువులను రోడ్లపైకి తీసుకువచ్చి నిరసన ప్రకటిస్తున్నారు. అలాగే సింఘు, తిక్రీల్లోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కేంద్రం బిల్లులను వెనక్కి తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు.

Tags :

Advertisement