Advertisement

ఈనెల 14వ తేదీన రైతులు దేశ వ్యాప్తంగా ఆందోళన

By: chandrasekar Wed, 09 Dec 2020 11:24 PM

ఈనెల 14వ తేదీన రైతులు దేశ వ్యాప్తంగా ఆందోళన


దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర వన్ పంపిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరిన్నట్లు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలు ప్రస్తుతం రద్దు చేయాలని రైతుల పట్టు బడుతున్నారు. ఇందుకోసం వారు వెనక్కి తగ్గబోమని తెలిపారు.

కేంద్రం చట్టాలను రద్దు చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేయాలని బుధవారం మీడియాకు తెలియజేసారు. ఇందుకోసం డిసెంబర్ 12వ తేదీన ఢిల్లీ టు జైపూర్ మరియు ఢిల్లీ టూ ఆగ్రా జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని తెలిపారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజా వద్ద కూడా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈనెల 12 వ తేదీ తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలను ఘోరావ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో బాటు డిసెంబర్ 14 వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. వీరు చేపట్టిన ఆందోళనలకు అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.

Tags :
|

Advertisement