Advertisement

  • కేంద్రంతో చర్చలకు సిద్ధం ..ప్రకటించిన రైతు సంఘాలు

కేంద్రంతో చర్చలకు సిద్ధం ..ప్రకటించిన రైతు సంఘాలు

By: Sankar Sun, 27 Dec 2020 10:07 PM

కేంద్రంతో చర్చలకు సిద్ధం ..ప్రకటించిన రైతు సంఘాలు


కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల మీద అనేక మంది రైతులు గత కొద్దీ రోజులుగా దేశ రాజధానిలో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే..అయితే ఈ వ్యవసాయ చట్టాల వలన రైతులకు లాభం తప్ప నష్టం లేదు అని కేంద్రం వాదిస్తుంది కానీ రైతులు మాత్రం ఆ చట్టాలు రద్దు చేసేవరకు నిరసనలు ఆపేది లేదు అని ప్రకటించారు...ఇప్పటికే రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కి రాలేదు..

అయితే మరోమారు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వస్తామని ప్రకటించారు. డిసెంబర్ 29న ఉదయం 11 గంటలకు చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 40 రైతు సంఘాలకు చెందిన ప్రతినిధులు శనివారం (డిసెంబర్ 26) సాయంత్రం ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ వివేక్‌ అగర్వాల్‌కు లేఖ రాశారు. అయితే.. వ్యవసాయ చట్టాల తొలగింపు అంశం ఎజెండాలో ఉంటేనే చర్చలకు వస్తామని షరతు పెట్టారు.

రైతులను ఆరో దఫా చర్చలకు ఆహ్వానిస్తూ వివేక్ అగర్వాల్ రెండు రోజుల కిందట లేఖ రాసిన విషయం తెలిసింది. తేదీ మీరే ఖరారు చేయండి అంటూ ప్రభుత్వం తరఫున రైతులకు ఆయన ఆఫర్ ఇచ్చారు. రైతు సంఘాల ప్రతినిధులు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ అంశంపై సమావేశమై చర్చించారు. అనంతరం తమ చర్చలకు తమ ఆమోదాన్ని తెలుపుతూ వివేక్ అగర్వాల్‌కు లేఖ రాశారు.

Tags :
|
|

Advertisement