Advertisement

  • గ్యాస్ లీకేజీ కారణంగా నష్టపోయిన రైతు కుటుంబాలు

గ్యాస్ లీకేజీ కారణంగా నష్టపోయిన రైతు కుటుంబాలు

By: chandrasekar Wed, 27 May 2020 3:34 PM

గ్యాస్ లీకేజీ కారణంగా నష్టపోయిన రైతు కుటుంబాలు


విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన సమీప ప్రజలపైనే కాదు స్థానిక వ్యవసాయంపై కూడా తీవ్రంగా పడింది. చేతికొచ్చిన పంటను నేలపాలు చెయ్యాల్సిన దుస్థితి కల్పించింది. స్టైరీన్ ప్రభావం ఆయా గ్రామాల్లో సాగు చేసే కూరగాయలు, ఆకు కూరలు, చెరువుల్లోని చేపలు, పశువుల పాలపై కూడా ఉంటుందని, కాబట్టి వాటిని తినొద్దు, తాగొద్దని చాటింపు వేసిన అధికారులు, దానివల్ల ఉపాధి, ఆదాయం కోల్పోయిన రైతులపై పడిన ప్రభావాన్ని మాత్రం పట్టించుకోలేదు.

farmer,families,affected,gas,leakage ,గ్యాస్, లీకేజీ, కారణంగా, నష్టపోయిన, రైతు కుటుంబాలు


నాలుగువందల కుటుంబాలకు ఉపాధి ఎల్జీ పాలిమర్స్‌ను ఆనుకొని ఉన్న వెంకటాపురం, కంపరపాలెం, పద్మనాభనగర్, నందమూరి నగర్ గ్రామాలతో పాటుగా పెందుర్తి, నియోజకవర్గ పరిధిలోని పొర్లుపాలెం, లక్ష్మీపురం, చీమలాపల్లి, చింతల అగ్రహారం తదితర గ్రామాల్లో దాదాపు 1500 ఎకరాల్లో రైతులు పశుగ్రాసం, ఆకు కూరలు, కూరగాయలు పండిస్తున్నారు.

విశాఖ నగరానికి వస్తున్నఆకుకూరల్లో దాదాపు 20 శాతంకు పైగా ఈ ప్రాంతాల నుంచే సరఫరా అవుతాయి. కూరగాయలు, ఆకు కూరల సాగుపై దాదాపు 400 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. వారిలో చాలా మందికి అర ఎకరం నుంచి మూడు ఎకరాలలోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులే.

Tags :
|
|

Advertisement