Advertisement

  • టీమిండియా ఘోరఓటమితో రవిశాస్త్రిపై తీవ్ర విమర్శలు...

టీమిండియా ఘోరఓటమితో రవిశాస్త్రిపై తీవ్ర విమర్శలు...

By: Sankar Sun, 20 Dec 2020 10:37 AM

టీమిండియా ఘోరఓటమితో రవిశాస్త్రిపై తీవ్ర విమర్శలు...


ఆస్ట్రేలియా తో అడిలైడ్ లో జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో టీమిండియా ఘోరపరాజయం చవిచూసిన విషయం తెలిసిందే...అయితే నిన్న టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగే వరకు కూడా టీం ఇండియా పైచేయి లోనే ఉంది..

అయితే కేవలం నిన్న గంట వ్యవధిలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది...62 పరుగుల ఆధిక్యంతో నిన్న బరిలోకి దిగిన టీమిండియా కేవలం మరొక 27 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది..దీనితో అత్యల్ప పరుగులకు అల్ అవుట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకుంది..

ఈ ఘోర ఓటమి తర్వాత భారత అభిమానులు అందరూ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి ని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రవిశాస్త్రి తన కోచ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆ బాధ్యతలను రాహుల్ ద్రవిడ్ కు అప్పగించాలని బీసీసీఐని అలాగే గంగూలీని కోరుతున్నారు. చూడాలి మరి ఈ ఓటమి పై బీసీసీఐ ఏ విధంగా స్పందిస్తుంది అనేది.

Tags :
|
|
|
|

Advertisement