Advertisement

  • అభిమాన సంఘాలతో మీటింగ్ లో రజినీకాంత్ కు షాకిచ్చిన అభిమానులు

అభిమాన సంఘాలతో మీటింగ్ లో రజినీకాంత్ కు షాకిచ్చిన అభిమానులు

By: Sankar Mon, 30 Nov 2020 1:31 PM

అభిమాన సంఘాలతో మీటింగ్ లో రజినీకాంత్ కు షాకిచ్చిన అభిమానులు


తమిళనాడు లో సినిమా స్టార్లు పార్టీలు పెట్టడం ,ఎన్నికలలో విజయం సాధించి అధికారం దక్కించుకోవడం అత్యంత సాధారణ విషయం...ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు తమిళ నాడు లో అధికారం చేపట్టినవారే...వారి తర్వాత ఇప్పుడు కమల్ హాసన్ , రజినీకాంత్ కూడా ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనాలని భావిస్తున్నారు...

సూపర్ స్టార్ రజిని కాంత్ ఈ రోజు తన అభిమాన సంఘాలతో మీటింగ్ పెట్టిన విషయం తెలిసిందే..ఈ సమావేశంలో రజినీకాంత్‌ ఊహించని అనుభవం ఎదురైంది. ఈ సమావేశంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అభిమాన సంఘాలు నినాదాలు చేశాయి. మీరు పార్టీ పెడితేనే మీ వెంట నడుస్తామని తేల్చి చెప్పేశారు అభిమాన సంఘాల నేతులు.

బీజేపీకి మద్దతు ఇస్తే మేము మీ వెంట నడువలేమంటూ స్పష్టం చేశాయి అభిమాన సంఘాలు. అభిమాన సంఘాల తీరుతో షాక్‌ తిన్న రజినీకాంత్‌.. వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. ఈ పరిణామంతో తమిళనాడు రాజకీయాలు మరింత కాక రేపుతున్నాయి.

Tags :
|

Advertisement