Advertisement

హోటల్ గదిలో ప్రముఖ తమిళ టీవీ నటి బలవన్మరణం

By: Sankar Wed, 09 Dec 2020 3:58 PM

హోటల్ గదిలో ప్రముఖ తమిళ టీవీ నటి బలవన్మరణం


ఈ ఏడాది ఒకవైపు కరోనా తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు దేశంలో వివిధ సినీ పరిశ్రమలలో ప్రముఖుల మరణాలు కూడా తీవ్రంగా కలిచివేస్తున్నాయి..

తాజాగా తమిళ బుల్లితెర నటి వి.జె.చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు..చెన్నైలోని నజరేత్‌పేట్‌లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసిన చిత్ర సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కొద్ది నెలల క్రితమే ఆమెకు వ్యాపారవేత్త హేమంత్‌తో నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం కాబోయే భర్తతో కలిసి హోటల్‌ గదిలో ఉన్న సమయంలోనే చిత్ర ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కాగా ‘పాండియన్ స్టోర్’లో‌ ‌ముల్లై పాత్రతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నది , ఇటీవల కాలంలో బుల్లితెరపై విశేషంగా రాణిస్తూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న చిత్ర ఆత్మహత్య చేసుకుందని తెలిసి ఆమె స్నేహితులు, సహనటులు షాకవుతున్నారు

Tags :
|

Advertisement