Advertisement

  • రానా హిరణ్య మూవీకి ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాతల భాగస్వామ్యం

రానా హిరణ్య మూవీకి ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాతల భాగస్వామ్యం

By: Sankar Wed, 24 June 2020 4:07 PM

రానా హిరణ్య మూవీకి ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాతల భాగస్వామ్యం



తెలుగులో ఇప్పుడు ఉన్న దర్శకులలో భారీగా సెట్లు వేసి సినిమాలు తీసే దర్శకుడు అంటే అందరికి గుర్తొచ్చేది గుణశేఖర్ ..ఇతడి సినిమాలు హిట్ , ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ పొందుతునాయి ..ఒక్కడు వంటి అల్ టైం ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్న గుణశేఖర్ , రుద్రమదేవి వంటి భారీ పిరియాడికల్ మూవీని తెరక్కేకిన్చాడు ..తాజాగా రానా తో హిరణ్య అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు ..అయితే తాజాగా రిలీజ్ కు ముందే ఈ సినిమా ఒక కొత్త రికార్డు ను సాధించింది ..ఇప్పటివరకు ఏ సౌత్ ఇండియన్ మూవీ కూడా ఆ రికార్డు సాధించలేదు ..

ప్ర‌ముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ద‌క్షిణాదిన హిరణ్యన సినిమాను నిర్మించ‌డం ద్వారా సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది ..గుణ‌శేఖ‌ర్ ఈ పౌరాణిక‌ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి నాలుగేళ్లుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు మ‌రో హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఫాక్స్ స్టార్ స్టూడియో ఎంట్రీ తో గుణశేఖర్ హిరణ్య సినిమా హాలీవుడ్ స్థాయి నిపుణులతో నిర్మితం కానుంది .. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. దీనితో ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాణ సంస్థ అయినా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తున్న తొలి సౌత్ ఇండియా సినిమాగా హిరణ్య రెకార్డులోకి ఎక్కనుంది ..


Tags :
|
|

Advertisement