Advertisement

  • ప్రముఖ క్రికెటర్ సంజయ్ దోబల్ కరోనా కారణంగా మృతి

ప్రముఖ క్రికెటర్ సంజయ్ దోబల్ కరోనా కారణంగా మృతి

By: chandrasekar Tue, 30 June 2020 7:38 PM

ప్రముఖ క్రికెటర్ సంజయ్ దోబల్ కరోనా కారణంగా మృతి


ప్రసిద్ధ క్రికెటర్, ఢిల్లీ అండర్ -23 సహాయక సిబ్బందిగా సేవలందించిన సంజయ్ దోబల్ కన్నుమూశారు. కొవిడ్ -19 నుంచి కోలుకోలేక సోమవారం ఉదయం చనిపోయినట్లు ఆయన కుటుంబం యొక్క సన్నిహితవర్గాలు తెలిపాయి. 53 ఏండ్ల వయసున్న డోబల్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సిద్ధాంత్ రాజస్థాన్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతుండగా చిన్న కుమారుడు ఏకాన్ష్‌ ఢిల్లీ అండర్ -23 జట్టులో అరంగేట్రం చేశాడు. కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడటంతో సంజయ్‌ దోబల్‌ వారం రోజుల క్రితం మహదూర్‌గఢ్‌లోని దవాఖానలో చేరాడు.

కొవిడ్ -19 కు పాజిటివ్‌గా నిర్దారణ అయిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. మరింత మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం ఆయనను ద్వారకా దవాఖానకు మార్చి ప్లాస్మా చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోగా సోమవారం ఉదయం కన్నుమూశారు అని డీడీసీఏ అధికారి ఒకరు చెప్పారు.

సంజయ్‌ దోబల్ ఢిల్లీ క్రికెటర్లలో వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, మిథున్ మన్హాస్‌తో కలిసి ఆడారు. అతను సొనెట్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడి కోచ్‌ తారక్ సిన్హా శిక్షణలో రాటుదేలారు. రంజీలో ఆడనప్పటికీ దోబల్ ఎయిర్ ఇండియాతో కాంట్రాక్ట్‌ ముగిసిన తరువాత జూనియర్ క్రికెటర్లకు శిక్షకుడిగా సేవలందించారు. గత దశాబ్దంలో జామియాలో జరిగిన ఇంగ్లండ్ మహిళల టెస్టులో దోబల్ ఇండియా జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించారు. సంజయ్‌ దోబల్‌ బీసీసీఐ మాజీ యాక్టింగ్ అధ్యక్షుడు సీకే ఖన్నాతోపాటు ఢిల్లీకి చెందిన క్రికెటర్లు మదన్ లాల్, మన్హాస్, డీడీసీఏ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.

Tags :
|
|

Advertisement