Advertisement

హైదరాబాద్ ను వణికిస్తున్న చలి

By: Sankar Fri, 06 Nov 2020 10:13 AM

హైదరాబాద్ ను వణికిస్తున్న చలి


హైదరాబాద్ లో చలి నెమ్మదిగా పెరుగుతోంది. నిన్న, మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బందులు పడిన నగరవాసులు ఇప్పుడు చలితో వణికిపోతున్నారు. ఓ వైపు కరొనా విస్తరిస్తుంటే.. మరో వైపు చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది.నవంబర్ నెలలోనే హైదరాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాత్రి సమంయలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత రాత్రి హైదరాబాద్ లో చలి 15.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతకు పడిపోయింది. ఇది సాధారణస్థాయి కంటే 3.6 డిగ్రీలు తగ్గి స్థిరంగా కొనసాగింది. క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. పగలు సాధారణ స్థాయికంటే 1.8 డిగ్రీలు పెరుగడంతో ఎండతీవ్రత అధికంగా ఉంటున్నది.

సాయంత్రం ఆరుగంటలకే చలి మొదలై.. రాత్రి సమయానికి తీవ్రంగా మారుతున్నది. చలి అనుకోకుండా పెరగడంతో నగరవాసులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయాల్లో బయటకు వెళ్లేవారు ముఖాలకు, చేతులకు మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. చలితోపాటు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. తగ్గిన ఉష్ణోగ్రతలతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

Tags :

Advertisement