Advertisement

  • నకిలీ ఫేస్బుక్ ఖాతాతో యువతికి వేదింపులు.. కేటుగాడు అరెస్టు...!

నకిలీ ఫేస్బుక్ ఖాతాతో యువతికి వేదింపులు.. కేటుగాడు అరెస్టు...!

By: Anji Fri, 18 Dec 2020 3:18 PM

నకిలీ ఫేస్బుక్ ఖాతాతో యువతికి వేదింపులు.. కేటుగాడు అరెస్టు...!

నకిలీ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించి యువతులను మోసం చేస్తున్న సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

రంగారెడ్డి జిల్లా హయత్నగర్ బృందావన్ కాలనీకి చెందిన వరకాల రమేశ్.. పద్మావతి పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచాడు.

యువతులు, మహిళల సమాచారం సేకరించి వారిని మోసం చేద్దామని భావించాడు. మహిళలతో స్నేహం చేసేందుకు వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించే వాడు. ఈ క్రమంలో ఓ యువతి అతని రిక్వెస్ట్కు స్పందించి.. మహిళగా భావించి చాటింగ్ చేయడం ప్రారంభించింది.

ఇదే అదనుగా రమేశ్ ఆమె వ్యక్తిగత ఫోన్ నంబర్ను సేకరించాడు. ఫోన్ చేసి తరచూ బెదిరింపులకు పాల్పడేవాడు. సదరు యువతి అతని నంబర్ను బ్లాక్ చేసింది. అతను వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టాడు.

మారు ఫోటోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఆందోళన గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైం బృందం.. రమేశ్ను అరెస్ట్ చేసింది.

Tags :

Advertisement