Advertisement

"ఫెయిర్ అండ్ లవ్లీ" కొత్త పేరు "గ్లో అండ్ లవ్లీ"

By: chandrasekar Fri, 03 July 2020 4:19 PM

"ఫెయిర్ అండ్ లవ్లీ" కొత్త పేరు "గ్లో అండ్ లవ్లీ"


భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రతి ఇంట్లో ఉండే సౌందర్య సాధనమిది. చిన్న పిల్లలు నుంచి పెద్దవారు దాకా ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్‌ను ముఖానికి పూసుకోనిదే బయటకు రారు. అంతలా జనాలకు దగ్గరైంది ఫెయిర్ అండ్ లవ్లీ. ఐతే ఈ ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను తయారుచేసే హిందూస్థాన్ యూనిలివర్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

ఫెయిర్ అండ్ లవ్లీ పేరు గ్లో అండ్ లవ్లీగా మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నల్లని రంగులో ఉన్న వారిని కించపరిచే విధంగా ఈ పేరు ఉందని పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో హిందూస్థాన్ యూనిలివర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మారడం వెనక ముగ్గురి పాకిస్తాన్ మహిళ పోరాటముంది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌ ఉద్యమంతో స్ఫూర్తి పొందిన ఆ మహిళలు దక్షిణాసియాలో జాతి వివక్షపై పోరాటానికి ఆన్‌లైన్ ఉద్యమాన్ని మొదలుపెట్టారు.

ఫెయిర్ అండ్ లవ్లీ పేరు, ప్రకటనలు నల్లగా ఉన్నవారిని కించపరుస్తోందని నల్లగా ఉన్న వారిని తెల్లగా మారుస్తామంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేశారు.

రెండు వారాల్లోనే 94 దేశాల్లోని 13 వేల మంది నుంచి వారికి మద్దతు దొరికింది. ఈ క్రీమ్ వర్ణ వివక్షను ప్రోత్సహిస్తోందంటూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మ‌ర‌ణానంత‌రం మొద‌లైన బ్లాక్ లైవ్స్ మ్యాట‌ర్ ఉద్య‌మంలో భాగంగా ప్ర‌పంచ వ్యాప్తంగా సౌంద‌ర్య ఉత్ప‌త్తులు త‌మ వ్యూహాలు, ప్ర‌క‌ట‌న‌ల్లో మార్పు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆసియాలో ఫెయిర్ అండ్ లవ్లీకి వ్యతిరేకంగా ఉద్యమం జరగడంతో యూనిలివర్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, 1975లో ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్‌ను మార్కెట్‌‌లోకి వచ్చింది. అప్పటి నుంచి ఒకే పేరు ఉంటూ వచ్చింది.

Tags :
|
|
|
|

Advertisement