Advertisement

  • వివాదాల నేప‌థ్యంలో ఫేస్‌బుక్ ఇండియా టాప్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా

వివాదాల నేప‌థ్యంలో ఫేస్‌బుక్ ఇండియా టాప్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా

By: chandrasekar Wed, 28 Oct 2020 8:13 PM

వివాదాల నేప‌థ్యంలో ఫేస్‌బుక్ ఇండియా టాప్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా


మంగ‌ళ‌వారం సౌత్ అండ్‌ సెంట్ర‌ల్ ఏషియా, ఫేస్‌బుక్ ప‌బ్లిక్ పాల‌సీ హెడ్ ఫ‌ర్ ఇండియా అంకి దాస్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజకీయ విష‌యాల‌ను నియంత్రించ‌డంలో త‌లెత్తిన వివాదాల నేప‌థ్యంలో ఆమె ప‌ద‌వి నుంచి నిష్క్ర‌మించిన‌ట్లుగా టాక్.

ప్రజా సేవపై వ్యక్తిగత ఆసక్తిని కొనసాగించడం, ప్రజలను క‌ల‌ప‌డం, సంఘాలను నిర్మించడం అనే మిషన్‌లో సుదీర్ఘ సేవ అనంత‌రం ఫేస్‌బుక్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న‌ట్లు ఆమె పేర్కొన్నారు.

2011లో తాను ఫేస్‌బుక్‌లో చేరినప్పుడు దేశంలో ఇంటర్‌నెట్ వృద్ధి అనేది చాలా తక్కువగా ఉందన్నారు. సామాజిక, ఆర్థిక అసమానతలను ఎలా పరిష్కరించాలో తరచుగా తాను ఆలోచిస్తున్న‌ట్లు తెలిపారు.

భారతదేశంలోని ప్రజలను కనెక్ట్ చేయాలనే లక్ష్యంతో చిన్న స్టార్ట‌ప్‌గా ప్రారంభమైన‌ట్లు చెప్పారు. తొమ్మిది సంవత్సరాల తరువాత త‌మ‌ మిషన్ నెరవేరిన‌ట్లుగా తాను భావిస్తున్నాన‌న్నారు.

సంస్థలోని చాలా తెలివైన, ప్రతిభావంతులైన వ్యక్తుల నుండి తానెంతో నేర్చుకున్న‌ట్లు తెలిపారు. ముఖ్యంగా పాలసీ బృందంలో వ్యక్తులను నుండి నేర్చుకున్న‌ట్లుగా ఆమె తెలిపారు. ఫేస్‌బుక్‌ ఇది ఒక ప్రత్యేక సంస్థ అని ప్రత్యేక వ్యక్తుల సమూహం అని అంకి దాస్ పేర్కొన్నారు.

Tags :
|

Advertisement