Advertisement

ఫేస్‌బుక్ ఇండియా ఎండీ అజిత్ మోహ‌న్‌కు ఊర‌ట...

By: chandrasekar Thu, 24 Sept 2020 5:30 PM

ఫేస్‌బుక్ ఇండియా ఎండీ అజిత్ మోహ‌న్‌కు ఊర‌ట...


ఢిల్లీలో జ‌రిగిన అల్ల‌ర్ల స‌మ‌యంలో విద్వేష‌పూరిత ప్ర‌సంగాల‌ను ఫేస్‌బుక్ ప్ర‌చారం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అల్ల‌ర్ల కేసులో త‌మ ప్యాన‌ల్ ముందు హాజ‌రుకావాలంటూ ఢిల్లీ అసెంబ్లీ ప్యాన‌ల్ ఇచ్చిన నోటీసుల‌పై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన ఫేస్‌బుక్ ఇండియా ఉపాధ్య‌క్షుడు, ఎండీ అజిత్ మోహ‌న్‌కు ఊర‌ట ల‌భించింది.

అత్యున్న‌త న్యాయ‌స్థానం అక్టోబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు ఎఫ్‌బీ ఇండియా ఎండీపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దు అని ఢిల్లీ అసెంబ్లీ ప్యాన‌ల్‌కు ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీలో జ‌రిగిన అల్ల‌ర్ల స‌మ‌యంలో విద్వేష‌పూరిత ప్ర‌సంగాల‌ను ఫేస్‌బుక్ ప్ర‌చారం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అజిత్ మోహ‌న్‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దు అని జ‌స్టిస్ సంజ‌య్ కిష‌న్ కౌల్‌, అనిరుద్దా బోస్‌, కృష్ణ మురారీల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఢిల్లీ అసెంబ్లీ ప్యాన‌ల్‌కు ఆదేశాలు జారీ చేసింది. న్యాయ‌శాఖ‌, హోంశాఖ‌, ఐటీశాఖ‌, లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీలు, ఢిల్లీ పోలీసులు కూడా ఈ అంశంపై స్పందించాలంటూ సుప్రీం పేర్కొంది. త‌మ ప్యాన‌ల్ ముందు హాజ‌రుకావాలంటూ ఇటీవ‌ల ఢిల్లీ అసెంబ్లీ ఎఫ్‌బీ ఇండియా ఎండీ మోహ‌న్‌కు ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ మోహ‌న్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

Tags :
|
|

Advertisement