Advertisement

  • మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకొచ్చిన ఫేస్‌బుక్‌

మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకొచ్చిన ఫేస్‌బుక్‌

By: chandrasekar Tue, 15 Sept 2020 6:20 PM

మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకొచ్చిన ఫేస్‌బుక్‌


సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో సరికొత్త ఫీచర్‌ ను తీసుకొచ్చింది. మెసేంజర్ యాప్‌ ద్వారా స్నేహితులందరూ కలిసి వీడియోలను చూసే అవకాశం కల్పించింది. ఇందుకోసం ‘వాచ్ టుగెదర్’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

వీడియో కాల్ ద్వారా 8 మంది స్నేహితులను యాడ్ చేసుకునే అవకాశాన్ని ఈ ఫీచర్ కల్పిస్తుంది. వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ మెసెంజర్ రూమ్స్ ద్వారా 50 మందిని యాడ్ చేసుకోవచ్చు. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్‌ను ఎదుర్కొనే ఉద్దేశంతో ఈ ఏడాది జులైలోనే ఈ టూల్‌ను ఫేస్‌బుక్ అందుబాటులోకి తెచ్చింది.

కరోనా మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితమైన లక్షలాది మందిని చేరుకునే ఉద్దేశంతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది ఫేస్‌బుక్. కాగా, నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఫేస్‌బుక్ ‘వాచ్ టుగెదర్’ లాంటి ఫీచరే ఉంది. ‘నెట్‌ఫ్లిక్స్ పార్టీ’ పేరుతో దీనిని స్టార్ట్ చేసింది. ఒకే స్క్రీన్‌పై ఒకే సినిమాను పలువురు చూసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

Tags :
|

Advertisement