Advertisement

  • మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ..ఫేస్‌బుక్ క్లారిటీ

మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ..ఫేస్‌బుక్ క్లారిటీ

By: Sankar Mon, 17 Aug 2020 1:44 PM

మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ..ఫేస్‌బుక్ క్లారిటీ


సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ బీజేపీతో చేతులు కలిపిందన్న విమర్శలపై ఫేస్‌బుక్ స్పందించింది. రాజకీయాలు, రాజకీయనేతలతో సంబంధం లేకుండా తమ విధానాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది.

రాజకీయ లేదా పార్టీ అనుబంధ సంస్థలతో సంబంధం లేకుండా హింసను ప్రేరేపించే ద్వేషపూరిత కంటెంట్‌ను తాము నిషేధించామనీ, ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాలను అమలు చేస్తున్నామని ఫేస్‌బుక్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ఇంకా చాలా చేయాల్సి ఉందనీ, తమ కఠిన నిబంధనల అమలులో పురోగతి సాధిస్తున్నామన్నారు. ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు రెగ్యులర్ ఆడిట్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

కాగా భారతదేశంలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తో పొత్తు పెట్టుకున్న ఫేస్‌బుక్ , బీజేపీ ,దాని అనుబంధ సంస్థ నేతలు చేస్తున్న ద్వేషపూరిత వ్యాఖ్యలను పట్టించుకోవడంలేదంటూ 'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించిన ప్రత్యేక కథనం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటల యుద్ధానికి దారి తీసింది. బీజేపీ సోషల్ మీడియాను తనకు అనుకూలంగా మలుచుకుంటోందంటూ కాంగ్రెస్నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇండియాలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, ఫేస్‌బుక్, వాట్సాప్‌లను నియంత్రిస్తున్నాయనడానికి అమెరికా మీడియా కథనం నిదర్శనమని రాహుల్ విమర్శించారు.


Tags :
|
|
|

Advertisement